“దిశా ఎన్కౌంటర్” ట్రైలర్ తో వర్మ మరోసారి.!

“దిశా ఎన్కౌంటర్” ట్రైలర్ తో వర్మ మరోసారి.!

Published on Sep 26, 2020 10:06 AM IST

మన టాలీవుడ్ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ సమయంలో కూడా పలు చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పలు రాజకీయ సబ్జెక్టులతో కలకలం రేపిన వర్మ ఆ తర్వాత ఊహించని విధంగా పలు సున్నితమైన అంశాలను తీసుకొని సంచలనం రేపాడు. గత రెండేళ్ల కితం హైదరాబాద్ లో కలకలం రేపిన అమృత ప్రణయ్ ల ఘటనపై “మర్డర్” అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఇపుడు అదే బాటలో గత ఏడాది నవంబర్ లో ఇదే హైదరాబాద్ లో చోటు చేసుకున్న దిశా ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇపుడు అంశంపైనే దర్శకుడు ఆనంద్ చంద్రతో “దిశా ఎన్కౌంటర్” అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించారు. ఇపుడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను వర్మ విడుదల చేసాడు. ఈ ట్రైలర్ మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉందని చెప్పాలి 2 నిమిషాల 45 సెకండల్లో ఎప్పటి లానే తనదైన శైలిలో సినిమా మొత్తాన్ని ట్రైలర్ లో చూపించేసాడు.

టెర్రఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి చూపించిన విజువల్స్ వరకు కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాస్తవికతకు దగ్గరగా దగ్గరగా చూపించారు. మరి ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ప్రేక్షకులే నిర్ణయించాలి. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో సోనియా ఆకుల నటించగా నట్టి క్రాంతి, కరుణలు నిర్మాతలుగా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు