వర్మ దర్శకత్వంలో రానా..?

వర్మ దర్శకత్వంలో రానా..?

Published on Oct 25, 2014 1:09 PM IST

Ram-Gopal-Varma_Rana

సినిమా జయాపజయాల సంగతి పక్కన పడితే.. రామ్ గోపాల్ వర్మ అంటే ప్రేక్షకులలో ఇప్పటికీ ఒక క్రేజ్ ఉంది. తన సినిమాలో స్టార్ కాస్ట్, టెక్నీషియన్ల ఎంపిక, టైటిల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. తాజాగా దగ్గుబాటి రానాతో ఒక సినిమా ప్లాన్ చేశారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకు ‘గొలుసు’ అనే టైటిల్ నిర్ణయించారు. వరుసగా సినిమాలు తీస్తూ వాటిని ఎలా పబ్లిసిటీ చేయాలో వర్మకు తెలిసినంత బాగా మరొకరికి తెలియదు.

రామ్ గోపాల్ వర్మ ఫేవరెట్ జోనర్ క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. స్టొరీ లైన్ విన్న తర్వాత రానా బాగా ఎగ్జైట్ అయ్యారని సమాచారం. ఈ సినిమాను రమేష్ వర్మ, నవీన్ మహతి సంయుక్తంగా నిర్మించనున్నారు. గతంలో వర్మ, రానా కలయికలో వచ్చిన హిందీ సినిమా ‘డిపార్టుమెంటు’ ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమాతో హిట్ కొట్టాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు