తమిళ్లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రామ్ హీరోయిన్

తమిళ్లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రామ్ హీరోయిన్

Published on Feb 10, 2016 8:47 PM IST

keeti-suresh
ఈ ఏడాది జనవరి 1 న రిలీజ్ అయిన యంగ్ హీరో రామ్ సినిమా “నేను శైలజ” సూపర్ హిట్ తో తెలుగు సినిమాకి ఓ శుభారంభాన్ని ఇచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత సంక్రాంతికి తమిళ్ లో వచ్చిన ‘రజినీ మురుగన్’ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండు విజయాలతో ఈ మలబార్ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా తమిళ్ లో అయితే ఈ భామకి దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ వచ్చింది. తమిళ్ స్టార్ హీరో ఇళయతలపతి విజయ్ సరసన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తన అరవై సినిమాకి కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. చిన్న హీరోలతో కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ కి ఇప్పుడు విజయ్ తో అవకాశం రావడంతో తన దశ తిరిగిందనుకోవచ్చు. ఒక దశలో విజయ్ సరసన తుపాకీ, జిల్లా సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ అనుకున్నా పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు ఆ అవకాశం కీర్తికి దక్కింది.

విజయ్ “అజగియా తమిళ్ మగన్” ఫేమ్ దర్శకుడు భరతన్ దర్సకుడు కాగా మది సినిమాటోగ్రాఫర్. పస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే నెల మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు