కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన రామ్!

ram

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న ఎనర్జిటి స్టార్ రామ్, ‘నేను శైలజ’ ముందువరకూ కొద్దికాలం ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. అయితే తాజాగా వచ్చిన హైపర్ మంచి టాకే తెచ్చుకున్నా, నేను శైలజ స్థాయిని అందుకోలేకపోయింది. దీంతో తననుంచి కమర్షియల్ సినిమాల కన్నా ప్రేమకథల్నే ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారన్న ఆలోచనతో రామ్ ప్లాన్ మార్చి మళ్ళీ ప్రేమకథ బాటనే పట్టారు.

అనిల్ రావిపూడితో ఇప్పటికే ఒప్పుకున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను పక్కనబెట్టి రామ్, ఓ లవ్‌స్టోరీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన లుక్ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాజాగా కొత్త లుక్‌కు సంబంధించిన ఓ ఫోటోను రామ్ పోస్ట్ చేశారు. ఈ లుక్ సినిమా కోసమేనా, సినిమా కోసం వేరే ఇతర లుక్ ప్రయత్నిస్తున్నారా అన్నది తెలియాలి. రామ్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

 

Like us on Facebook