కరుణాకరన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యువహీరో…?

కరుణాకరన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యువహీరో…?

Published on May 27, 2016 9:50 AM IST

karunakaran
దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ’తొలిప్రేమ’ సినిమా తీసి సంచలన విజయం సాధించిన దర్శకుడు కరుణాకరన్. తరువాత చాలా సినిమాలు తీసినా అవేవి ’తొలిప్రేమ’ సినిమా స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. గతంలో హీరో రామ్ తో ’ఎందుకంటే ప్రేమంట’ సినిమా తీసి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిన కరుణాకరన్ ఇప్పుడు మరోసారి రామ్ తో సినిమా చేస్తున్నట్లు సమాచారం.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా కథ హీరో రామ్ ని బాగా ఆకట్టుకున్నట్టు సమాచారం. ’నేను శైలజ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ చేయడానికి ఆసక్తిచూపుతున్నట్టు తెలిసింది. అందుకే కరుణాకరన్ చెప్పిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథ బాగా నచ్చినట్టు సమాచారం. స్రవంతి రవికిశోర్ ఈ సినిమా నిర్మించే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు