యూరప్ లో రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేస్తున్న రామ్

యూరప్ లో రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేస్తున్న రామ్

Published on Feb 27, 2015 9:07 AM IST

Ram-and-Rakul-preet-Singh
హీరో రామ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం యూరప్ లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. మార్చ్ రెండవ వారం వరకూ షూటింగ్ జరుగుతుంది.

డాన్ శీను, బలుపు సినిమాలను తీసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. బ్రహ్మానందం, సాయి కుమార్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రధారులు. థమన్ సంగీత దర్శకుడు. వేసవిలో ఈ చిత్రం మనముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు