లక్కీ డైరెక్టర్‌తో రామ్ మరో సినిమా!

లక్కీ డైరెక్టర్‌తో రామ్ మరో సినిమా!

Published on Nov 28, 2015 2:39 PM IST

Ram
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ఓ స్ట్రాంగ్ హిట్ సినిమా కోసం కష్టపడుతున్నారు. ‘శివమ్’ సినిమాతో మంచి హిట్ వస్తుందని ఆశించిన రామ్‌కు ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో ప్రస్తుతం రామ్ తన ఆశలన్నీ ‘నేను శైలజ’ అన్న సినిమాపై పెట్టుకున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు. జనవరి 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే.. రామ్ తన తదుపరి సినిమాపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

‘నేను శైలజ’ తర్వాత రామ్ తనకు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో జత కట్టనున్నారు. దర్శకుడు శ్రీనువైట్లతో కూడా రామ్ ఓ సినిమా చేయనున్నట్లు వినిపించినా, ప్రస్తుతానికి శ్రీనివాస్ సినిమానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో హిట్ సినిమా కొట్టాలని రామ్ భావిస్తున్నారట. 14 రీల్స్ సంస్థ కానీ, రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్‌లో కానీ ఈ సినిమా రూపొందే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు