ఇంకో రెండు రోజుల్లో చరణ్ సందడి మొదలవుతుంది !

ఇంకో రెండు రోజుల్లో చరణ్ సందడి మొదలవుతుంది !

Published on Mar 28, 2017 3:21 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ కథలో సుకుమార్ చరణ్ ను సరికొత్త లుక్లో చూపించాలని నిర్ణయించుకున్నాడు. హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ భిన్నంగానే ఉండనున్నాయి. ఇకపోతే ఇప్పటికే ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ ఏప్రిల్ 1 వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. రాజమండ్రితో పాటు ఇతర గోదావరి జిల్లాల్లోని కొన్ని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది.

అలాగే 31 రోజుల పాటు జరగబోయే ఈ లాంగ్ షెడ్యూల్లో చరణ్ తో పాటు సమంత కూడా మొదటి రోజు నుండే పాల్గొననుంది. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనున్న ఈ సినిమాకు ప్రముఖ రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు . చరణ్ గత చిత్రం ‘ధృవ’ ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు