‘హైపర్’ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు

‘హైపర్’ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు

Published on Oct 1, 2016 1:22 PM IST

hyper-ram
‘కందిరీగ’ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, హీరో రామ్ కలిసి చేసిన చిత్రం ‘హైపర్’ నిన్న 30వ తేదీన విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి ఏరియాలో మొదట రోజు మంచి వసూళ్లను రాబట్టింది. ‘ నేను శైలజా’ చిత్రంతో ఫామ్ లోకి వచ్చిన రామ్ మొదటి నుండి ఈ సినిమాపై గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అలాగే సంతోష్ శ్రీనివాస్ కూడా సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఇక ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఏరియాల వారీగా కలెక్షన్ల వివరాలు చూస్తే

ఏరియా కలెక్షన్స్
కృష్ణా 21 లక్షలు
గుంటూరు 34 లక్షలు
ఈస్ట్ గోదావరి 26 లక్షలు
నైజాం 1. 51 కోట్లు
వైజాగ్ 37 లక్షలు
నెల్లూరు 12 లక్షలు
సీడెడ్ 34 లక్షలు
టోటల్  3.15 Crores

సంబంధిత సమాచారం

తాజా వార్తలు