రామ్ కొత్త సినిమా రిలీజ్ డేట్!

రామ్ కొత్త సినిమా రిలీజ్ డేట్!

Published on Jul 18, 2016 2:24 PM IST

ram1
‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, ప్రస్తుతం తన కొత్త సినిమాను శరవేగంగా పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఇక సినిమా ఇలా షూటింగ్ జరుపుకుంటూండగానే, టీమ్ అప్పుడే ఓ విడుదల తేదీని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇక దసరా సీజన్‍ సినిమాకు బాగా కలిసి వస్తుందని, ఎలాగైనా అనుకున్న తేదీకి సినిమాను సిద్ధం చేయాలని ప్రొడక్షన్ వేగవంతం చేశారట.

రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది. ఈ సినిమాకు ‘హైపర్’ అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 14 రీల్స్ పెద్ద ఎత్తున నిర్మిస్తోండగా, గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు