దెయ్యంగా మారనున్న రమ్యకృష్ణ

దెయ్యంగా మారనున్న రమ్యకృష్ణ

Published on Feb 8, 2016 2:38 PM IST

Ramya_Krishna
‘బాహుబలి’ సినిమాకి చాలా కీలకమైన శివగామి పాత్రలో నటించి ఒక్కసారిగా అందరినీ తనవైపుకు తిప్పుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఈ సినిమాతో రమ్యకృష్ణ మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చింది, వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా రమ్యకృష్ణ నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో రమ్యకృష్ణకి ఫుల్ డిమాండ్ వచ్చింది. వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ చేయనున్న ఓ హర్రర్ సినిమాలో కీ రోల్ పోషించేందుకు సైన్ చేసిందని తెలిపాము.

కృష్ణవంశీ మొదటి సారి హర్రర్ నేపధ్యంలో చేయనున్న ఈ రుద్రాక్ష సినిమాలో రమ్యకృష్ణ కూడా మునుపెన్నడూ చేయని ఓ కొత్త పాత్రలో కనిపించనుంది. అదేమిటంటే ఈ హర్రర్ సినిమాలో అందరినీ భయపెట్టే దెయ్యం పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. రమ్యకృష్ణ పవర్ఫుల్ లేడీ, మరియు భక్తిరస చిత్రాల్లో దేవతగా కనిపించింది కానీ ఇప్పయ్తి వరకూ దెయ్యం తరహా పాత్రలో కనిపించలేదు. దెయ్యం రోల్ కదా అని ఎప్పటి దెయ్యం లుక్ ఉండదట, దెయ్యం పాత్రలని డీ డిఫైన్ చేసేలా సరికొత్తగా రమ్యకృష్ణ పాత్రని, గెటప్ ని డిజైన్ చేసారట. అనుశాక్ మెయిన్ లీడ్ లో నటించనున్న ఈ సినిమాలో సమంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా సమ్మర్ నుంచి మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు