‘రొమాంటిక్’ సినిమాకు రమ్యకృష్ణ గ్యారెంటీ

‘రొమాంటిక్’ సినిమాకు రమ్యకృష్ణ గ్యారెంటీ

Published on Nov 17, 2019 9:56 AM IST

దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రెజెంట్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సినిమా పేరుకి తగ్గట్టే పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటెర్టైనర్. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర చేస్తున్న సీనియర్ నటి రమ్యకృష్ణ సైతం ఈ మాటే చెబుతున్నారు.

సినిమా క్రేజీగా ఉంటుందంటున్న ఆమె యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుందని, ఆకాష్ పూరి, కేతిక శర్మలు తమ నటనతో తప్పక అలరిస్తారని గట్టిగా చెబుతున్నారు. మరి రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి ఇంతగా చెబుతున్నారంటే సినిమాలో యువతీయువకులకు కావలసిన క్రేజీ స్టఫ్ గట్టిగానే ఉంటుందన్నమాట. పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే యేడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు