డ్రగ్స్ పై స్పందించిన రానా !


గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను కొనసాగిస్తోంది. ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు తన అభిప్రాయాలను తెలపగా తాజాగా రానా కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.

రానా మాట్లాడుతూ ‘ఇప్పుడు డ్రగ్స్ పెద్ద వాళ్ళు వాడుతున్నారని అంటున్నారు. కానీ అవి స్కూల్ పిల్లల వరకు వెళ్లిపోయాయి. పెద్దవాళ్ళంటే ఆలోచించగలరు. కానీ చిన్న పిల్లలు ఆలోచించలేరు. కాబట్టి వీటిని వాళ్ళ వరకు చేరకుండా అరికట్టాలి. డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరం. నేనెప్పుడూ వాటికి వ్యతిరేకినే. బాహుబలి సినిమా తర్వాత తెలుగు పరిశ్రమ గొప్పదని పోగోడినవాళ్ళు, ఈ డ్రగ్స్ వ్యవహారం బయటికొచ్చాక ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ గొప్ప పరిశ్రమే. దేశంలోని అన్ని సినీ రంగాలతో పోలిస్తే మనమే లాభాల్లో ఉన్నాం’ అన్నారు.

 

Like us on Facebook