బాలీవుడ్ హీరోతో కలిసి రానా న్యూ ప్రొడక్షన్ హౌస్

బాలీవుడ్ హీరోతో కలిసి రానా న్యూ ప్రొడక్షన్ హౌస్

Published on Aug 27, 2015 7:31 PM IST

rana-and-akshy
టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రానా సినిమాలలోకి రాకముందు నుంచి కూడా తను సినిమాలకి సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో తన సత్తాని చాటుకున్నాడు. రానాకి హీరోగా కొనసాగుతున్నా సినిమా నిర్మాణ రంగంవైపు, సరికొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యాలి అనే విషయంలో బాగా ఆసక్తి ఉందని ఇది వరకే చాలా సార్లు తెలియజేశాడు. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే రానా దగ్గుబాటి తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని లాంచ్ చెయ్యడానికి సిద్దమయ్యాడు.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే రానా ఒక్కడే కాకుండా మరో బాలీవుడ్ స్టార్ హీరోని పార్టనర్ గా చేసుకొని ఈ న్యూ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. రానా – అక్షయ్ కుమార్ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్, అలాగే ఈ ఏడాది వీరిద్దరూ కలిసి ‘బేబీ’ సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి, ఆ బ్యానర్ లో టాలెంట్ ఉన్న న్యూ కమర్స్ కి అవకాశాలు ఇచ్చి, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే రానా – అక్షయ్ కుమార్ తమ ప్రొడక్షన్ హౌస్ కి సంబందించిన పూర్తి వివరాలను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు