ఆటో డ్రైవర్ గా అఖిల్, కూలీగా రానా!!

ఆటో డ్రైవర్ గా అఖిల్, కూలీగా రానా!!

Published on Feb 10, 2016 7:59 PM IST

rana
పైన టైటిల్ చూసి ఏంటి అక్కినేని అఖిల్ ఏమన్నా అటో డ్రవర్ రీమేక్ చేస్తున్నాడా, అలాగే రానా ఏమైనా కూలీ నెంబర్ 1 రీమేక్ చేస్తున్నాడా అనే ఆలోచనలు వస్తుంటే వాటిని ఆపేయండి.. ఇప్పుడు అసలు విషయం చెబుతా.. అఖిల్ తన ఫ్యాన్ అయిన అస్విత్ రెడ్డి కోసం ఆటో డ్రైవర్ గా మారాడు. ఖమ్మంలో ఉండే ఆరేళ్ళ ఆశ్విత్ రెడ్డి కిడ్నీ సమస్యతో బాధ పడుతూ ఉంటె అఖిల్ అతన్ని కలిసి ధన సాయం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్ గా మారి ఆటో నడిపి మనీ కలెక్ట్ చేసి ఇచ్చాడు. ఈ విషయంలో అఖిల్ కి కితాబులు వచ్చాయి.

అది జరిగిన మరుసరోజే రానా దగ్గుబాటి ఖాకీ డ్రెస్ మేడలో రెడ్ స్కార్ఫ్ వేసి అచ్చమైన కూలీలా మూతలు మోసి డబ్బు సంపాదించాడు. ఇది చేసింది త్వరలో మంచు లక్ష్మీ నుంచి రానున్న ‘మేము సైతం’ ప్రోగ్రాం కోసం కావడం విశేషం. త్వరలోనే ఓ సోషల్ సపోర్ట్ కోసం మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా ‘మేము సైతం’ అనే ప్రోగ్రాం మొదలు కానుంది. ఈ ప్రోగ్రాం కోసం ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కూకట్ పల్లి మార్కెట్ లో కూరగాయలు అమ్మితే, ఈ రోజు రానా కూకట్ పల్లి రైతు బజార్ లో కూలీగా మారి మూటలు మోసి డబ్బు సంపాదించాడు. ఇది ఈ మేముసైతం షోకి డెడికేట్ చేసాడు. మేముసైతం అనే ప్రోగ్రాంకి మంచి బూస్టప్ దొరుకుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు