ఏడేళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న రానా !

ఏడేళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న రానా !

Published on Feb 19, 2017 3:45 PM IST


2010 లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రంతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన రానా దగ్గుబాటి ఈరోజుటితో తన ఏడేళ్ల నటనా జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. రానా ఈ ఏడేళ్లలో మరే నటుడూ సాగించలేని వైవిధ్యమైన ప్రయాణాన్ని సాగించాడు. ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చి కేవలం హీరోగానే చేయాలనే టార్గెట్ పెట్టుకోకుండా తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో నటుడిగా ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకుని, సక్సెస్ సాధించి అన్ని పరిశ్రమలకు సుపరిచితుడై జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు.

దేశం మొత్తం తెలుగు పరిశ్రమ వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి ‘బాహుబలి’ లో సైతం హీరోతో సమానమైన ప్రతి నాయకుడి పాత్ర చేసి భళా అనిపించుకున్నాడు. తాజాగా నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘ఘాజి’ చిత్రంలో నటించి అందరి ప్రసంశలూ అందుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రానాకు ప్రస్తుతం పరిశ్రమలో మునుపెన్నడూ ఎవరికీ దక్కని ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైనా భిన్నమైన పాత్రైనా, సినిమా అయినా చేయాలంటే ఆయనే గుర్తొస్తారు. ముఖ్యంగా ప్రయోగాలు చేయాలనుకునే దర్శకులకు రానా ఒక విలువైన ముడిసరుకులా కనిపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు