దర్శకుడిపై విరుచుకుపడ్డ రానా దగ్గుబాటి !
Published on Dec 28, 2016 1:55 pm IST

rana1

తమిళ పరిశ్రమలో సంచలనంగా మారి అందరి దృష్టికీ వెళ్లిన దర్శకుడు సురాజ్ పై ఇంకా విమర్శల వర్షం తగ్గలేదు. విషయం తెలుసుకుంటున్న స్టార్ నటులు ఒక్కొక్కరు ఆయనపై తమ వ్యతిరేకత తెలుపుతున్నారు. తన సినిమాల్లో హీరోయిన్లు పొట్టి బట్టలే వేసుకునేలా చూస్తానని, బి,సి సెంటర్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలని అలా చేస్తానని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ చూసి ఆయన తాజా చిత్రం ‘కత్తి సందై’ లో నటించిన తమన్నా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

డైరెక్టర్ సురాజ్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఈ అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు సురాజ్ తనకు, పరిశ్రమలోని అందరు ఆడవాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా స్టార్ హీరోయిన్ నయనతార, ఇతరులు నిలవడంతో దర్శకుడు సురాజ్ అందరికీ లేఖ ద్వారా క్షమాపణలు తెలిపాడు. ఈ విషయాన్ని తాజాగా తెలుకున్న నటుడు, బాహుబలితో నేషనల్ లెవల్ కు ఎదిగిన రానా ట్విట్టర్ ద్వారా ‘ఇప్పుడే ఈ విషయం గురించి తెలుసుకున్నాను. ఇలాంటి వ్యక్తులు మన మధ్య పనిచేస్తునందుకు చాలా అవమానకరంగా ఉంది’ అంటూ ఒక్క మాటలో తన కోపాన్ని, వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో వెల్లడించారు.

 

Like us on Facebook