ఆగష్టు నుండి రానా, గుణశేఖర్ సినిమా !

ఆగష్టు నుండి రానా, గుణశేఖర్ సినిమా !

Published on Feb 20, 2018 1:23 PM IST

రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పాత్ర నచ్చితే ఏ దర్శకుడితో అయినా సినిమా చెయ్యడానికి వెనుకాడని ఈ హీరో త్వరలో డైరెక్టర్ గుణశేఖర్ తో సినిమా చెయ్యబోతున్నాడు. గుణశేఖర్ చెయ్యబోయే ఈ పౌరాణిక చిత్రంలో రానా హిరణ్యకశిపుడిగా రానా నటించబోతున్నాడు. ఈ సినిమాకి ‘హిరణ్యకశిపు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 150 కోట్ల వరకు ఖర్చు కానుందట. ఇది ‘భక్త ప్రహ్లాద’ కథే అయినా హిరణ్యకశిపుడి కోణంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమా తరువాత అదే తరహాలో భారీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఆగష్టు నుండి ప్రారంభంకానుంది. గుణ టీం వర్క్స్ బ్యానర్లో గుణశేఖర్ ఈ సినిమాను స్వయంగా నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమకు చెందిన నటీనటులు నటించబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు