బయోపిక్ లో నటించనున్న రానా ?
Published on Jan 5, 2018 9:29 am IST

విభిన్నమైన కథలను తయారు చేసుకుంటున్న రచయితలు, దర్శకులు తమ మొదటి చాయిస్ గా రానానే ఎంచుకుంటున్నారు. ఇప్పటికే రానా ‘1945, హాతి మేరే సాతి’ వంటి సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు ఆయన వద్దకు మరో క్రేజీ స్క్రిప్ట్ వెళ్లినట్లు సమాచారం. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ దర్శకుడు వంశీ ఒకప్పటి గజ దొంగ, పేదవాళ్ల రాబిన్ హుడ్ గా పిలవబడే టైగర్ నాగేశ్వర్ రావ్ జీవితం ఆధారంగా ఒక చిత్రం తీయనున్నాడు.

ఇందులో టైగర్ నాగేశ్వర్ రావ్ పాత్రకు రానాను అయితే బాగుంటుందని ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట వంశీ. అయితే దీనిపై అధికారిక సమాచారం అందలేదు కానీ ఒకవేళ నిజమే అయితే రానా ఈ సినిమాకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఈ బయోపిక్ ను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు.

 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు