‘బాహుబలి’ వల్ల ఏ అమ్మాయి ఇష్టపడదంటున్న రానా

‘బాహుబలి’ వల్ల ఏ అమ్మాయి ఇష్టపడదంటున్న రానా

Published on Feb 10, 2016 8:34 AM IST

rana
టాలీవుడ్ ఆడడుగుల హీరోలలో ఒకడు, అలాగే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ఒకడు రానా దగ్గుబాటి. గత ఏడాది బాహుబలి సినిమాతో రానా ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. బాహుబలి తర్వాత రానా చేసిన సినిమా ‘బెంగుళూరు నాట్కల్’. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న రానా తన పెళ్లి గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలను తెలిపాడు. తనని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదనీ, దానికి కారణం బాహుబలి అని చెప్పాడు.

అసలు రానా పెళ్ళికి బాహుబ్లికి సంబంధం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే సమాధానం రానా మాటల్లోనే ‘బాహుబలి 2 లో నా పాత్ర చూసిన తర్వాత ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. అంత నెగటివ్ యాంగిల్ లో ఈ సినిమా ఉంటుందని’ అన్నాడు. ఇది కాకుండా రానా పలు భాషల్లో సినిమాలకు సైన్ చేసాడు. ‘పలు భాషల్లో పలు సినిమాలు ఒప్పుకున్నాను. అవి పూర్తయ్యేంత వరకూ పెళ్లి చేసుకోనని’ అన్నాడు. చెప్పాలంటే రానా బాహుబలిలో నెగటివ్ షేడ్స్ చేసాడు కానే ఎతనకి హీరోకి సమానమైన ఇమేజ్ వచ్చింది. కాబట్టి రానాని చూసి అమ్మాయిలి భయపడరు, పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడతారని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు