డైరెక్ట్ చేస్తానంటున్న రానా

డైరెక్ట్ చేస్తానంటున్న రానా

Published on Jan 25, 2015 8:00 PM IST

rana
టాలీవుడ్ లో ఉన్న ఆరడుగుల ఆజానుబాహుల్లో యంగ్ హీరో రానా కూడా ఒకరు..రానా దగ్గుబాటి ఇప్పుడు పలు సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా రానా డైరెక్టర్ గా మారాలని ఉందని అన్నాడు. గత శుక్రవారం హిందీలో రిలీజ్ అయిన బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంగ్లీష్ ప్రత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కచ్చితంగా ఓ రోజు డైరెక్టర్ అవుతానని, ఓ సినిమా చేస్తానని అన్నాడు. అలాగే నిర్మాతగా కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తానని అన్నాడు.

అలాగే మరికొన్ని ఆసక్తికర విషయాలను గురించి చెబుతూ ‘రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతనలతో బాగా క్లోజ్ గా ఉంటాను. మేము అప్పుడప్పుడు కలిసి తమ సినిమా కథల గురించి ఒకరితో ఒకరు చర్చించుకుంటామని అన్నాడు. అప్పుడు ప్రతి కథ పైన ముగ్గురు జడ్జ్ మెంట్ ఉంటుందని’తెలిపాడు. రానా నటించిన బేబీ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వరద కురుస్తోంది. ఇది కాకుండా రానా నటించిన రుద్రమదేవి, బాహుబలి సినిమాలు రిలీజ్ కి దగ్గరవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు