‘రోబో-2’ ఆడియో కార్యక్రమంలో సందడి చేయనున్న రానా !

రజనీ, శంకర్ ల ‘2 పాయింట్ 0 ‘ సందడి దుబాయ్ లో మొదలైపోయింది. భారీ ఏర్పాట్ల నడుమ బుర్జ్ ఖలీఫాలో జరగనున్న ఈ వేడుక ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వేడుకగా నిలవనుంది. ఇప్పటికేరాజనీకాంత్, అక్షయ కుమార్, రెహమాన్, శంకర్, అమీ జాక్సన్ లు దుబాయ్ చేరుకుని ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు.

ఇక రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా తమిళం నుండి స్టార్ కమెడియన్, సపోర్టింగ్ యాక్టర్ ఆర్జే బాలాజీ వ్యవహరిస్తుండగా తెలుగు నుండి ప్రముఖ నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రానా ఇప్పటికే పలు టీవీ కార్యక్రమాల్లో హోస్టుగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సుమారు రూ.430 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

 

Like us on Facebook