హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ !

హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ !

Published on Aug 16, 2017 6:00 PM IST


‘బాహుబలి’ తర్వాత రానా స్థాయి చాల వరకు పెరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఆయన తర్వాతి సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఈ ఆసక్తి వలనే రానా తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ యూఎస్ లో మంచి ఓపెనింగ్ తో పాటు వసూళ్లను కూడా రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కలు ప్రకారం నిన్న మంగళవారం 46,821 డాలర్లను కలెక్ట్ చేసిన ఈ చిత్రం మొత్తం 5 రోజులకు కలిపి 522,692 డాలర్లతో హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది. ప్రదర్శింపబడుతున్న చాలా చోట్ల మంచి రన్ ఉండటంతో త్వరలోనే సినిమా మిలియన్ మార్క్ అందుకునే అవకాశముంది. సోలో హీరోగా రానాకు ఇది మంచి అఛీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల చిత్రం సేఫ్ జోన్లోకి చేరుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు