ప్రభాస్ ని పొగిడేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో !
Published on Jul 6, 2017 8:51 am IST


‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్ స్థాయి ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయనొక జాతీయ స్థాయి హీరో. ఆయనతో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఎగబడుతుంటే ఆయనతో కలిసి నటించాలని స్టార్ హీరోయిన్లు చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. ‘బాహుబలి-2’ చిత్రంలో ఆయన పెర్ఫార్మెన్స్ కు చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఫిదా అయి పొగడ్తలు కూడా కురిపించారు.

తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ కూడా చేరిపోయారు. తాజాగా తన సినిమాకు సంబంధించి ఒక వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ ఏది అనేప్రశ్న రాగా బాహుబలి సిరీస్ లో ప్రభాస్ నటన అద్భుతమని, చాలా గొప్పగా నటించారని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook