‘రంగమార్తాండ’తో క్రియేటివ్ డైరెక్టర్ !

‘రంగమార్తాండ’తో క్రియేటివ్ డైరెక్టర్ !

Published on Oct 17, 2019 2:00 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు ఉన్న డైరెక్టర్ ల్లో ‘కృష్ణ వంశీ’ పేరు ముందు వరసలో ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడు, తాజాగా నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ గా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి తెలుగులో ‘రంగమార్తాండ’ అని టైటిల్ ను పెట్టారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఏమైనా కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు