రంగస్థలం ఉత్తరాంధ్ర లేటెస్ట్ కలెక్షన్స్

రంగస్థలం ఉత్తరాంధ్ర లేటెస్ట్ కలెక్షన్స్

Published on Apr 25, 2018 5:30 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో సమంత అక్కినేని హీరోయిన్ గా నటించిన చిత్రం రంగస్థలం. మొదటి రోజునుండి సూపర్ హిట్ టాక్ తో పరిగెడుతున్న ఈ చిత్రం ఇప్పటికీ చాల స్టడీగా మంచి కలెక్షన్లతో ముందుకు పోతోంది. రాంచరణ్ , సమంత, ఆది పినిశెట్టి ల అద్భుత నటన ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఉత్తరాంధ్ర ఏరియాలో ఇప్పటివరకు రూ.12.2 కోట్ల షేర్ కొల్లగొట్టిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సుకుమార్ అద్భుత టేకింగ్, రంగమ్మ అత్తగా అనసూయ నటన, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు కెమెరా పనితనం ఈ సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని నవీన్ యెర్నేని, మోహన్, రవిశంకర్ నిర్మించారు…..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు