లెజెండరీ క్రికెటర్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడు ?

లెజెండరీ క్రికెటర్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడు ?

Published on May 31, 2020 12:30 AM IST

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో కూడా ఏప్రిల్ 10నే విడుదల చేయాలనుకున్నా.. కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ ను ఫిక్స్ చేసుకుంది చిత్రబృందం. అన్ని కుదిరితే ఆగష్టు సెకెండ్ వీక్ లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

కాగా ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు