ఆ సినిమాలో రావ్ రమేష్ పాత్ర హైలెట్ అంట !

ఆ సినిమాలో రావ్ రమేష్ పాత్ర హైలెట్ అంట !

Published on Feb 19, 2018 9:06 PM IST

రాహుల్ రవీంద్రన్ హీరోగా రేష్మి మీనన్, జియా హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ. ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత సినిమా పై పాజిటివ్ హాప్ వచ్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను రాజ్ సత్య దర్శకత్వం వహించగా ఎం.ఎల్. రాజు , ఆర్.ఎస్ కిషన్ నిర్మించారు.

రావ్ రమేష్ ఈ సినిమాలో చేసిన పాత్ర సినిమాకు ప్రదానం కాబోతోందని సమాచారం. గతంలో చాలా సినిమాల్లో రావ్ రమేష్ చేసిన పాత్రలకు మంచి పేరు రావడమే కాకుండా ఆయన సినిమాలు విజయం సాదించాయి. అదే తరహాలో హైదరాబాద్ లవ్ స్టొరీ సక్సెస్ అవుతుందేమో చూడాలి. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు