హిట్స్ లో ఉన్న హీరోయిన్ ఆమాత్రం ఫోజు కొట్టకుంటే ఎలా..!

హిట్స్ లో ఉన్న హీరోయిన్ ఆమాత్రం ఫోజు కొట్టకుంటే ఎలా..!

Published on Feb 19, 2020 8:25 PM IST

ఇండస్ట్రీలో తాటికాయంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం లేకపోతే నెట్టుకురావడం కష్టం. అందం, అభినయం ఉన్నా హిట్ తగలక కనుమరుగైంపోయిన వాళ్లు వందల్లో ఉన్నారు. హీరోయిన్స్ కి ఈ లక్కీ లెగ్ సెంటిమెంట్ చాల అవసరం. పెర్ఫామెన్స్ ఎలా ఉన్నా అవకాశాలు మాత్రం హిట్ ట్రాక్ ను బట్టే తలుపు తడతాయి. ఇక టాలెంట్ అదృష్టం రెండూ ఉంటే ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలే. ఇప్పుడు ఇండస్ట్రీలో రష్మిక పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఒకటి రెండు మినహా అన్ని హిట్ గా నిలిచాయి. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు, బన్నీ-సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో హీరోయిన్ గా కూడా అవకాశం దక్కించుకుంది.

అయితే సక్సెస్ ఫుల్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్న రష్మికకు కొంచెం ఆటిట్యూడ్ ఎక్కువైందని బయట టాక్. వేదికల పై, ఇంటర్వ్యూలో ఈమె మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అసహజంగా అనిపిస్తుందట. రష్మిక ఆర్టిఫీషియల్ బిహేవియర్ ప్రేక్షకులకు వింతగా తోస్తుందట. హిట్స్ లో ఉన్న హీరోయిన్ ఆ మాత్రం బెట్టు చూపించకపోతే గుర్తింపు ఏమి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పబ్లిక్ వేదికల పై రష్మిక మాటతీరు హాట్ టాపిక్ గా మారింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు