రవిబాబు చిత్రం గురించి ఆసక్తికర అప్డేట్..!
Published on Mar 18, 2017 10:07 am IST


నటుడిగా, దర్శకుడిగా రవిబాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అతడి దర్శకత్వంలో వచ్చే చిత్రాలు ప్రత్యేకంగా ఉంటాయని అభిమానుల్లో అంచనా ఉంది. ప్రస్తుతం రవిబాబు ‘అదిగో’అనే ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. కాగా త్వరలోనే రవిబాబు మరో చిత్రాన్నికూడా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

నిర్మాత స్వప్న దత్ తో రవిబాబు తరువాతి చిత్రం ఉండనుంది. ప్రస్తుతం ఆమె ‘మహానటి’ చిత్ర ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. కాగా వీరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం రవిబాబు స్టైల్ లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

 
Like us on Facebook