రవి తేజ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే !

ravi-teja
సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ చిత్రం చేసిన రవితేజ్ ఆ చిత్రం అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. అంత గ్యాప్ తరువాత ప్రస్తుతం ఈయన రెండు కొత్త సినిమాలకు కమిటయ్యారు. అందులో ఒకటి దర్శకుడు బాబీతో చేయనున్నాడు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న దసరా సందర్భంగా మొదలుపెట్టనున్నారు.

ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. రవితేజ్ మరో సినిమాని విక్రమ్ అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. ఇకపోతే రవితేజ్, బాబీ కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన ‘పవర్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాబీ కూడా చివరగా పవన్ కళ్యాణ్ తో చేసిన ‘సర్దార్ గబ్బార్ సింగ్’ చిత్రం పరాజయం పొందడంతో ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలన్న ఉద్దేశ్యంతో సినిమా చేస్తున్నాడు.

 

Like us on Facebook