మే 11న రవితేజ ‘పవర్’ ఆడియో.?

మే 11న రవితేజ ‘పవర్’ ఆడియో.?

Published on Apr 20, 2014 5:10 PM IST

Power_raviteja1
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘పవర్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవలే కోల్ కతాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘పవర్’ ఆడియోని మే 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే జూన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చేస్తున్నారు.

‘బలుపు’ సినిమాకి రైటర్ గా పనిచేసిన బాబీ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాని రాక లైన్ వెంకటేష్ నిర్మాత. రవితేజ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా రెజీనా నటిస్తోంది. కోనా వెంకట్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు