తమన్నా, రాశిఖన్నాలతో స్టెప్పులేస్తున్న రవితేజ!

తమన్నా, రాశిఖన్నాలతో స్టెప్పులేస్తున్న రవితేజ!

Published on May 23, 2015 6:08 PM IST

Ravi-Teja
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఉదయమే ఓ పాట షూట్‌తో 3వ షెడ్యూల్ మొదలైంది.

రవితేజ, తమన్నా, రాశి ఖన్నాల మధ్య ఓ ఎనర్జిటిక్ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నాలతో పాటు అక్ష గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు