రవితేజ ‘బెంగాల్ టైగర్’ ప్రారంభమైంది.

రవితేజ ‘బెంగాల్ టైగర్’ ప్రారంభమైంది.

Published on Jan 30, 2015 10:37 AM IST

ravi-teja
‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకేక్కబోయే ‘బెంగాల్ టైగర్’ సినిమా నేడు లాంచనంగా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోస్ లో ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా యూనిట్ సభ్యులు మరియు కొందరు సినీ ప్రముఖుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రవితేజ సరసన తొలిసారిగా మిల్కీ బ్యూటీ తమన్నా, రాశి ఖన్నాలు ‘బెంగాల్ టైగర్’లో నటిస్తున్నారు.

రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ త్వరలో పూర్తవుతాయని సమాచారం. ‘కిక్ 2’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

ఈ సినిమాను కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడిగా పరిచయమైన ‘ఏమైంది ఈ వేళ’ సినిమాను నిర్మించింది ఈయనే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు