ఈ నెల నుండి రవితేజ కొత్త సినిమా !
Published on Feb 1, 2018 4:43 pm IST

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రవితేజ చెయ్యబోతున్న సినిమా ఈ నెలలో ప్రారంభం కానుందని రవితేజ ట్విట్టర్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది.

గతంలో శ్రీను వైట్ల రవితేజ కాంబినేషన్లో ‘వెంకి, దుబాయ్ శ్రీను’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తోన్న ‘నేల టికెట్’ సినిమా రెండో షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభంకానుంది.

 
Like us on Facebook