మాస్ మహారాజా ఈ సంవత్సరం రెండు సినిమాలు చేస్తాడట !

మాస్ మహారాజా ఈ సంవత్సరం రెండు సినిమాలు చేస్తాడట !

Published on Jan 16, 2017 4:00 PM IST

ravi-teja
తెలుగులో మాస్ ఆడియన్సులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో రవితేజ్. గతంలో ఆయన నుండి ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలు తప్పకుండా విడుదలయ్యేవి. కానీ 2016 లో మాత్రం ఆయన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు మొదలే కాలేదు. ఆయన చివరి చిత్రం 2015లో విడుదలైన ‘బెంగాల్ టైగర్’. దీని తరువాత రవితేజ పూర్తిగా బయట కనిపించడం మానేశారు. దీంతో ఈ మాస్ మహారాజా అభిమానులు చాలా డీలా పడ్డారు.

ఆ తరువాత చాలా రోజులకు ఆయన స్నేహితుడు, దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ ప్రస్తుతం వరల్డ్ టూర్లో బిజీగా ఉన్నాడని, ఎన్నో ఏళ్ళు విరామం లేకుండా కష్టపడటం వలన రెస్ట్ తీసుకుంటున్నాడని చెప్పారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఈ యేడు రెండు సినిమాలు చేస్తాడట. అందులో ఒకటి అనిల్ రావిపూడి చిత్రం. దీన్ని మార్చి నుండి మొదలుపెడతారట. అలాగే రెండవ చిత్రం కూడా యంగ్ డైరెక్టర్ తోనే చేయనున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ 2016 బాకీని కుడా 2017లో తీర్చే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు