మార్చ్ నుంచి రవితేజ ‘రాబిన్ హుడ్’

మార్చ్ నుంచి రవితేజ ‘రాబిన్ హుడ్’

Published on Feb 8, 2016 8:24 AM IST

ravi-teja
గత ఏడాది ‘బెంగాల్ టైగర్’తో హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి సినిమా దిల్ రాజుతో చేయాలి. కానీ ఆ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.. దాంతో ఆయన తదుపరిగా కమిట్ అయిన యంగ్ డైరెక్టర్ చక్రి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇటీవలే ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసామని తెలిపాము.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఫిబ్రవరిలో అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫినిష్ చేసి మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటోంది. రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన ఈ రాబింన్ హుడ్ పాత్ర తరహాలోనే రవితేజ పాత్ర కూడా ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో హాట్ బ్యూటీ అమీ జాక్సన్ ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అమీ కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి, అందుకే అమీ జాక్సన్ తన కాల్షీట్స్ అడ్జస్ట్ చేయగలమా లేదా అనే సందిగ్దంలో ఉంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే అమీ జాక్సన్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు