రెండు నెలలు ‘యుఎస్’ లోనే మాస్ రాజ !

రెండు నెలలు ‘యుఎస్’ లోనే మాస్ రాజ !

Published on May 21, 2018 5:09 PM IST

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ‘టచ్ చేసి చూడు’ సినిమా పరాజయం తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవితేజ. మరి ఈ సినిమా రవితేజ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. ఇక రవితేజ ప్రస్తుతం శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన రెండు నెలలు అమెరికాలోనే ఉండనున్నాడు.

వరుస సినిమాలతో దూకుడు పెంచిన రవితేజ ఏడాదికి 3సినిమాలు రిలీజ్ చేసేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో రాబోతుంది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న శ్రీను వైట్ల ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ తానేంటో నిరుపించుకోవాలనే కసితో ఉన్నాడు. ఈ సినిమాతో సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు