వాయిదాపడిన రవితేజ కొత్త సినిమా షూట్ !

వాయిదాపడిన రవితేజ కొత్త సినిమా షూట్ !

Published on Jan 16, 2018 5:05 PM IST


విక్రమ్ సిరికొండతో చేసిన ‘టచ్ చేసి చూడు’ విడుదలకు సిద్దమవుతుండగానే మాస్ మహారాజ రవితేజ ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమాకి కమిటయ్యారు. ‘నేల టికెట్’ అనే మాస్ మసాలా టైటిల్ పెట్టబడిన ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 5వ తేదీన మొదలై మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.

దీంతో రెండవ షెడ్యూల్ ను ఈ నెల 18న మొదలుపెట్టాలని టీమ్ భావించి అన్ని ఏర్పాట్లను చేసుకుందట. కానీ కారణాలు తెలియరాలేదుకానీ ఈ షూటింగ్ వాయిదాపడ్డట్టు తెలుస్తోంది. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, ప్రవీణ్ వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు