మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ ల కొత్త చిత్రం ప్రస్తుతం విరామ సమయంలో ఉన్న సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో నిర్విరామంగా షూటింగ్ చేయడం వలన, ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండటం వలన నెలరోజులపాటు సెలవు తీసుకున్న టీమ్ ఈ నెల 5వ తేదీ అనగా సోమవారం నుండి రెండవ షెడ్యూల్ ను ఆరంభించనున్నారు.
అయితే ప్రస్తుతం లండన్ వెకేషన్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మాత్రం 8వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటారట. ఈ షెడ్యూల్ కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో నే జరగనుంది. గ్రామీణ నైపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ లు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- మహేష్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకుని, ప్రస్తుతం ప్రభాస్ పక్కన నటిస్తున్న ఇండోజర్మన్ నటి
- తమన్నాకి షాకిచ్చిన ప్రొడ్యూసర్
- ఓన్లీ యాక్షన్ అంటున్న ఎన్టీఆర్ !
- “ఊ. పె. కు. హ.” ఓ నవ్వుల పండగ : ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పి. ఆర్. నాగరాజు
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.