ప్రతినిధికి రీ రికార్డింగ్ ప్రధాన ఆకర్షణ : నారా రోహిత్

ప్రతినిధికి రీ రికార్డింగ్ ప్రధాన ఆకర్షణ : నారా రోహిత్

Published on Apr 19, 2014 6:22 PM IST

Pratinidhi
నారా రోహిత్ తాజా చిత్రం ప్రతినిధి ఈ నెల 25న మనముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్లాటినం డిస్క్ వేడుకకుచిత్రబృందం తో పాటు నటులు నాని, ఆర్ నారాయణ మూర్తి కుడా హాజరయ్యారు

ఈ సినిమా గురించి నారా రోహిత్ మాట్లాడుతూ “సాయి కార్తిక్ అందించిన సంగీతం అద్భుతంగా వుంది. రీ రికార్డింగ్ తో ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్ళిపోయాడు. ఈ ప్రతినిధికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బలమని “తెలిపాడు

ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. టీజర్ సినిమాపై అంచనాలని పెంచింది. సినిమా ఎన్నికల సమయంలో విడుదల చేసి మంచి పని చేస్తున్నారని నాని, నారాయణమూర్తి లు తెలిపారు

ప్రశాంత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయంకానున్నాడు. ఆనంద్ రవి కధను అందించాడు. సాంబశివరావు నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు