‘అదిరింది’ ఎందుకు ఆలస్యం అవుతోంది ?

‘అదిరింది’ ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Published on Oct 24, 2017 3:33 PM IST


తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ తెలుగులో అనువాదం అవుతున్న సంగతి తెలిసిందే, ఈ చిత్రం రెండు భాషల్లో ఒకే రోజు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగు విడుదల వాయిదా పడింది. సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నట్లు తమిళ్ లో రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.

తెలుగు విడుదల తేది 26 అని ప్రకటించినప్పటికీ ఇప్పటికి ఇంకా ఈ సినిమా సెన్సార్ పూర్తి కాలేదు, రేపు సెన్సార్ ఉంటుందని గత మూడు రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అవ్వడం లేదు, తమిళ్ లో మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాను తెలుగులో త్వరగా విడుదల చేసి క్యాష్ చేసుకుంటే మంచిదననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాజల్, సమంతా, నిత్యా మీనన్ నటించిన ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా రెహమాన్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు