సోదరుడి అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ !

సోదరుడి అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ !

Published on Jun 25, 2017 7:51 PM IST


నిన్న రాత్రి హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన కారు ప్రమాదంలో స్టార హీరో రవితేజ సోదరుడు భరత్ రాజ్ (46) మృతి చెందిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్తానం స్మశానవాటికలో జరిగాయి. కానీ విచిత్రంగా హీరో రవి తేజ మాత్రం ఈ అంత్యక్రియలకు హాజరుకాలేదు.

దీంతో రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ రవితేజ సన్నిహిత వర్గాల ప్రకారం తమ్ముడి మరణాన్ని చూసి తట్టుకోలేకే రవి తేజ అంత్యక్రియలకు హాజరుకాలేదని, అంతేగాని ఇందులో ఎలాంటి వివాదాలు లేవని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఇతర నటులు అలీ, ఉత్తేజ్, రఘుబాబు, జీవితా రాజశేఖర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు