‘అజ్ఞాతవాసి’లో పాత్రను సునీల్ ఎందుకు కాదన్నారంటే !

పవన్ కళ్యాణ్, త్రివిక్రం ల కలయికలో వస్తున్న మూడవ చిత్రం ‘అజ్ఞాతవాసి’ భారీ కేజ్ నడుమ జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టులో దర్శకుడు త్రివిక్రమ్ తన మిత్రుడు, హీరో సునీల్ కు ఒక రోల్ ఇచ్చారని, కానీ సునీల్ ఆ ఆఫర్ ను తిరస్కరించారని గతంలో వార్తలొచ్చాయి. ఆ వార్తల వెనుక అనేక విపరీత కారణాలు కూడా పుట్టుకొచ్చాయి.

కానీ సునీల్ తాజాగా తన ‘2 కంట్రీస్’ ప్రమోషన్లలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. త్రివిక్జ్రం తనకు ఆఫర్ ఇచ్చిన మాట, తాను దాన్ని తిరస్కరించిన సంగతి నిజమేనన్న సునీల్ త్రివిక్రమ్ తనకు ఆఫర్ ఇచ్చే సమయానికి కథలోని తన పాత్ర తాను ఆశించిన విధంగా లేదని, ఇంకా పూర్తిగా డిజైన్ కాలేదని, అందుకే వద్దన్నానని చెప్పారు. ఇకపోతే అయాన్ ‘2 కంట్రీస్’ చిత్రం రేపే రిలీజ్ కానుంది.

 

Like us on Facebook