అందుకే ఆ సినిమా చెయ్యలేదు అంటున్న కాజల్ !

అందుకే ఆ సినిమా చెయ్యలేదు అంటున్న కాజల్ !

Published on Mar 23, 2018 8:00 PM IST

కాజల్ నటించిన ఎంఎల్ఎ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె రవితేజ సినిమాను టైం లేకపోవడం వల్ల చెయ్యలేకపోయానని చెప్పింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నట్టిస్తోన్న సినిమాకు ముందుగా కాజల్ ను అనుకున్నారు. ఆమె బిజీగా ఉండడంతో అను ఇమ్మ్యన్యూల్ ను తీసుకోవడం జరిగింది.

ప్రస్తుతం కాజల్ క్వీన్ రీమేక్ సినిమాలో నటిస్తోంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటిస్తోంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు బాలివుడ్ లో ఒక సినిమా చెయ్యబోతోంది ఈ హీరోయిన్. వాటికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈరోజు విడుదలైన ఎంఎల్ఎ సినిమాలో కాజల్ నటన , అభినయానికి మంచి పేరు లభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు