‘బాహుబలి – 2’ చూశాక కృష్ణంరాజుగారి స్పందన !

‘బాహుబలి – 2’ చూశాక కృష్ణంరాజుగారి స్పందన !

Published on Apr 28, 2017 6:40 PM IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదలను దేశమంతా పండుగలా జరుపుకుంటోంది. ఏ సినీ ప్రేమికుడి నోటి వెంట చూసినా బాహుబలి మాట తప్ప వేరే ఏం వినబడటం లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులైతే ఆనందంతో పాటు గర్వాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి సినిమా చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజుగారు ఈ చిత్రం యొక్క స్పెషల్ షోను వీక్షించారు.

సినిమా చుసిన ఆయన తన అనుభవాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని, అంత గొప్ప అనుభూతిని ఈ సినిమా ద్వారా రాజమౌళి కలిగించారని అన్నారు. అలాగే సినిమాలోని ప్రతి సన్నివేశం, పాత్ర రాజమౌళి ప్రతిభకు నిదర్శనమని, టాలీవుడ్ నుండి ప్రపంచ స్థాయి దర్శకుడు రాజమౌళియేనని గర్వాంగా చెబుతున్నానని అన్నారు. ఇకపోతే సినిమాకు విడుదలైన ప్రతి చోట నుండి మంచి పాజిటివ్ స్పందన రావడం చూస్తే ఖచ్చితంగా చిత్రం సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమని అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు