నైజాంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్

నైజాంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్

Published on Feb 8, 2016 10:12 AM IST

Sardaar
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ ఎవరు చెప్పారు, ఏ సినిమాలో చెప్పాడు అనేది మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పొలీస్ ఆఫీసర్ అయిన గబ్బర్సింగ్ పాత్రలో చేసిన సినిమా ‘గబ్బర్ సింగ్’. ఇప్పుడు అదే పాత్రని రిపీట్ చేస్తూ రతన్ పూర్ లో గబ్బర్ పవర్ చూపించనున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉన్న ఈ సినిమాని ఏప్రిల్ 8న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పై ఉన్న అంచనాల వలన ఎరోస్ వారు భారీ మొత్తానికి వరల్డ్ వైడ్ రైట్స్ ని కొనుక్కున్నారు.

అంతే కాకుండా ఒక్క నైజాం తప్ప మిగతా అన్ని ఏరియాల బిజినెస్ ని రికార్డ్ ప్ర్రైజెస్ కి క్లోజ్ చేసారు. ఒక్క నైజాం రైట్స్ ని మాత్రం అమ్మకుండా ఆపారు. కానీ రీసెంట్ గా రికార్డ్ స్థాయిలో ఆఫర్ రావడంతో సర్దార్ గబ్బర్ సింగ్ నైజాం రైట్స్ ని ఇంద్ర ఫిల్మ్స్ వారికి అమ్మారు. ఇంద్ర ఫిల్మ్స్ వారు 20 కోట్లకి సర్దార్ నైజాం రైట్స్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ నైజాంలో అత్యధిక రేటు పలికిన సినిమా ‘బాహుబలి'(25 కోట్లకి అమ్ముడైంది), ఆ సినిమా తర్వాత 20 కోట్లకి అమ్ముడుపోయి నైజాంలో భారీ రేతుకింముడు పోయిన సెకండ్ సినిమాగా రికార్డ్ సాధించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్ లపై కేరళలో ఓ పాటని షూట్ చేస్తున్నారు. లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పవర్ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు