నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ రెజీనా !
Published on Oct 19, 2016 2:13 pm IST

regina
తెలుగు పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణీ అవుతున్న రెజినా తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తే ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. ఈరోజే కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే రెజీనా నిశ్చితార్థం చేసుకున్నది ఎవరిని అనేది మాత్రం తెలియడంలేదు. రెజీనా కూడా అభిమానులని సస్పెన్స్ లో ఉంచడానికి అన్నట్టు కేవలం ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్న చేతులను మాత్రమే ఫోటో తీసి ఇన్ స్టాగ్రమ్ లో ఉంచింది.

అలాగే ఈ ప్రత్యేకమైన రోజున తనకు బ్లెస్సింగ్స్ కావాలంటూ అభిమానుల్ని కోరింది. తాను పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో చూపించాలని తనకూ ఉందని, కానీ ఇప్పుడే కాదని, త్వరలోనే చూపిస్తానని చెప్పుకొచ్చింది. రెజీనా చెప్పిన ఈ సడన్ న్యూస్ తో కాస్త షాక్, కాస్త ఆశ్చర్యానికి గురైనా కూడా రెజీనా పెళ్లి చేసుకోబోయేది ఎవరినో చూడాలంటే అభిమానులు కాస్త వెయిట్ చెయ్యక తప్పదు.మరోవైపు ఇదంతా నిజమేనా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషనా అనే అనుమానాన్ని కూడా వ్యకం చేస్తున్నారు కొందరు అభిమానులు.

 
Like us on Facebook