విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్’ !

విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్’ !

Published on May 25, 2018 4:00 PM IST

తమిళ హీరో జ‌యం ర‌వి హీరోగా నటించిన రూపొందిన త‌మిళ చిత్రం ‘టిక్‌: టిక్‌: టిక్’. తెలుగులో కూడా ఈ చిత్రం ఇదే పేరుతో రిలీజ్ కానుంది. శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్ల‌ర్‌గా ఉండబోతోంది. దినులో రవి ఆస్ట్రోనాట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలకావల్సిన ఈ చిత్రం ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చి ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.

జూన్ 22న చిత్రం తమిళంతో పాటు తెలుగులో సైతం విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని చదవడం బ్రదర్స్ సమర్పిస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటిసారి అంతరిక్షం నైపథ్యంలో రూపొందిన ఈ చిత్రం టెక్నీకల్ గా ఉన్నత స్థాయిలో ఉంటుందనే టాక్ వినబడుతోంది. డి.ఇమాన్ సంగీత‌మందించిన ఏ చిత్రంలో నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు