రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రాజ్ తరుణ్ సినిమా !

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రాజ్ తరుణ్ సినిమా !

Published on Jan 16, 2017 11:38 PM IST

kittu-unnadu
‘ఉయ్యాలా జంపాల’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇమేజ్ జోలికి పోకుండా కథకు ప్రాముఖ్యత ఇస్తూ వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. దీంతో చాలా మంది నూతన దర్శకులు, నిర్మాతలు రాజ్ తరుణ్ తో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేస్తున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం కూడా వైవిధ్యభరితమైన చిత్రమే. ఇందులో ‘మజ్ను’ ఫేమ్ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు. ఇకపోతే రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంటగా ‘అందగాడు’ పేరుతో మరో భిన్నమైన సినిమాని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు